సంజయ్ రౌత్ సారీ చెప్పాలి…

0
87

.కంగనాను ‘హరామ్ ఖోర్’ అంటూ సంబోధించిన శివసేన నేత సంజయ్ రౌత్ ఆమెకు క్షమాపణ చెప్పాలని మరో బాలీవుడ్ నటి దియా మిర్జా డిమాండ్ చేశారు. కంగనాను అంత మాటన్న రైత్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా ‘ఇంటాలెరెంట్ డిబేట్ వారియర్స్’ ఎందుకు సైలెంటయ్యారని దియా ప్రశ్నించింది. అలాంటి భాష ఉపయోగించినందుకు సంజయ్ రౌత్ సారీ చెప్పాల్సిందేనన్నారు దియా. ట్విటర్ వేదికగా దియా తన నిరాశను వెలిబుచ్చింది. ‘ సార్.. కంగనా అన్న మాటలకు మీరు అసంతృప్తిని వ్యక్తం చేసే హక్కు మీకుంది. కానీ అలాంటి భాష వాడినందుకు క్షమాపణ చెప్పాల్పిందే’ అని రౌత్ ను ఉద్దేశించి దియా తన ట్వీట్ పేర్కొన్నారు.
ముంబయ్ ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ కంగనా ట్వీట్ చేయటంతో అసలు ఈ దుమారం రేగింది. అది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. శివసేన నేతలతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర కంగన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ముంబయ్ రావద్దని అని అనటమే గాక కంగనా ఒక మెంటల్‌ పేషెంట్‌తో పోల్చారు సంజయ్ రౌత్. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సైతం కంగనా తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చెడు అభిప్రాయముంటే కంగనా ముంబైకి రావద్దన్నారు. దీనికి కౌంటర్ గా కంగన మరింత ఘాటుగ స్పందించింది. ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. నన్ను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తా’ అంటూ సవాల్‌ విసిరారు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here