ఐపిఎల్ 2020 లీగ్ రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎవచుకుంది. దీ్తో ఢిల్లీ క్యాపిటల్స్ మొదల బ్యాటింగ్ కి దిగింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఢిల్లీ, మొదటి సారి కెఎల్ రాహు ల్ కెప్టెన్గా పంజాబ్ బరిలోకి దిగాయి. దుబారు ఇంటర్నేషనల్ స్డేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభమైంది.
కాగా రెండవ ఓవర్ లోనే శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. రాహుల్ అతడిని రనౌట్ చేశాడు. పఅథ్వీ షా ఐదు పరుగులతో, హెటె్మెయర్ 4 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ : శిఖర్ ధావన్, పఅథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వి.కీ), షిమ్రాన్ హిట్మెయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జ్, మోహిత్ శర్మ.
పంజాబ్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, నికోలస్ పూరన్, క్రిష్ణప్ప గౌతమ్, క్రిస్ జోర్డాన్, షెల్డోన్ కోట్రేల్, రవి బిష్నోయి, మహ్మద్ షమీ.