పట్టాలెక్కిన మెట్రో..

0
74

దాదాపు 6 నెలల విరామం తరువాత ఢిల్లో మెట్రో ట్రెయిన్ సేనవలు పున:ప్రారంభమయ్యాయి. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ ఉదయం ఏడు గంటలకు తొలి రైలు కదిలింది. ఇది గుర్గామ్, సమయపూర్ బద్లీ , హుడా సిటీ సెంటర్‌ను కలుపుతుంది. మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందని ప్రయాణీకులు అంటున్నారు. రైళ్లు రెండు షిఫ్టులలో సేవలందిస్తాయి. ఉదయం 7 నుంచి ఒంటి గంటవరకు , అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య నడుస్తాయి. మిగతా మెట్రో కార్యకలాపాలు దశలవారీగా పున: ప్రారంభమవుతాయి. వచ్చే ఐదు రోజుల వ్యవధిలో, అంటే సెప్టెంబర్ 12 నాటికి, మెట్రో ప్రాంగణంలో కోవిడ్ -19 వ్యాప్తిని తనిఖీ చేస్తారు. తరువాత తగిన భద్రతా చర్యలతో మిగతా మార్గాలలో కూడా సేవలు ప్రారంభమవుతాయి, సామాజిక దూరం, ఫేస్ మాస్క్ , హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here