వెండి తెర సింధుగా దీపిక పక్కా..!

0
78

రోనా సంక్షోభం తలెత్తి ఉండకపోతే ఇప్పటికే చాలా మంది క్రీడాకారులను మనం వెండితెరపై చూసేవాళ్లం. అంటే వాళ్లు సినిమాల్లో నటిస్తున్నారని కాదు. వారి బయెపిక్ లు అన్నమాట. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు క్రీడాకరుల బయోపిక్ లు కరోనాకు ముందే పట్టాలు ఎక్కాయి, కానీ మధ్యలో కరోనా వచ్చి వాటికి బ్రేక్ వేసింది. అయినా ఆ సినిమాల కథ ముగిసిపోయినట్టు అనుకోకూడదు. త్వరలోనే అవి మళ్లీ పట్టాలెక్కుతాయి. పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్‌ బయోపిక్ లకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్‌ బయోపిక్‌కు ‘శభాష్‌ మిత్తూ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్‌కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది.


సింధూ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్‌ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్‌ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్‌కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్‌ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్‌ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్‌ టాప్‌ స్టార్‌ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్‌ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్‌ లేని కారణంగా బయోపిక్‌ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్‌ తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్‌ ఇచ్చారు సోనుసూద్‌.!


లాక్‌డౌన్‌ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్‌ టైంకి ఈ మూడు బయోపిక్‌లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్‌ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 వేసవిలో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్‌ చెబుతున్నారు. అంటే తెర మీద సింధును చూడటానికి మరో రెండేళ్లు వెయిట్ చేయటక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here