చెన్నై ఎండలో 10 గంటల బ్యాటింగ్.. ఒక తరం మరవజాలని హీరో

0
101

ప్రతి అంతర్జాతీయ క్రికెటర్ కు ఇది నాది ..అని చెప్పుకునే మ్యాచ్ లు ..ఇన్నింగ్స్ కొన్ని ఉంటాయి. డీన్ జోన్స్ కెరీర్ లో కూడా అలాంటి ఓ చారిత్రకమైన, అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ ఇన్నింగ్స్ మన మీదే ఆడారాయన. అది 34 ఏళ్ల క్రితం చెన్నైలో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్. చెన్నయ్ అంటేనే చెమటు కక్కించే వేడి. అందునా వేడికి ఏ మాత్రం తట్టుకోలేని ఆస్ట్రేలియా టీం.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ వేడి..ఉక్కపోతను తట్టుకుని జోన్స్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించి..ఆ మ్యాచ్ ని అస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ మ్యాచ్ లలో ఒకటిగా నిలబెట్టాడు. అంతే కాదు ఆ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు పునరుజ్జీవం లాంటిది.

ఆ రోజు నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది అని గురువారం ముంబైలో మరణించడానికి ఐదు రోజుల ముందు డీన్ జోన్స్ ట్వీట్ చేశారు. నిజమే 1986 లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ డీన్ జోన్స్ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. అది అతను ఆడుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మాత్రమే.

కన్వర్టెడ్ వన్-డౌన్ పొజిషన్‌లో బ్యాటింగ్ చేసిన జోన్స్ ఆ ఇన్నింగ్స్ లో 210 పరుగులు చేశాడు. 700 నిమిషాల పాటు అంటే దాదాపు పదిన్నర గంటలు క్రీజ్ లో ఉన్నాడు. మా మూలు పరిస్థితుల్లో అయితే ఓ క్రికెటర్ కు ఇది పెద్ద విషయం కాదు. కానీ ఆడేది మద్రాసులో (ఇప్పుడు చెన్నై). 80 శాతం తేమతో 40 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే నరకమే. ఆ పరిస్థితిలో నెంబర్ త్రీగా వచ్చాడు. ఇన్నింగ్స్ మధ్యలో డీహైడ్రేషన్ కు గురయ్యాడు. ఇన్నింగ్స్ మొత్తం మిడ్ వేలో కష్ట కష్టంగా నిలబడ్డాడు.

నేను రాత్రి నీరు తాగలేదు. రెండు రోజు ఒక గంట ఆట తరువాత నేను ఇబ్బందుల్లో ఉన్నానని నాకు అర్థమైంది. కప్పు టీ నో కాఫీ నో తప్ప మరేమీ తాగలేదు.డీహైడ్రేషన్ , రీహైడ్రేషన్ గురించి మాకు అప్పుడు తెలియదు. ఎలా బ్యాటింగ్ చేసానో కూడా గుర్తు లేదు. 120 తరువాత నాకు ఎక్కువ గుర్తులేదు. నేను ఆడిన ప్రతి ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి షాట్ నాకు తెలుసు. ఆ ఇన్నింగ్స్‌లో 120 తర్వాత నాకు ఒక్క విషయం కూడా గుర్తులేదు, ”అని చెప్పాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లకు 574 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దానికి జవాబుగా కపిల్ దేవ్ సెంచరీ సాయంతో భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 397 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 170/5 కు డిక్లేర్ చేసి భారత్ కు 348 లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భారత్ 347 పరుగులు చేసి మ్యాచ్ ని టైగా ముగించింది.

“డీన్ జోన్స్ ఒక తరం క్రికెటర్లకు హీరో , ఓ గొప్ప ఆటగాడుగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు” అని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ అన్నారు. “1980 మరియు 1990 లలో క్రికెట్ చూసిన ఎవరైనా క్రీజులో అతను నిర్భయంగా నిలుచుండే తీరుని , అతను ఆడిన ప్రతి మ్యాచ్ లో అతని ఎనర్జీ , ఆట పట్ట మక్కువను ప్రేమగా గుర్తుచేసుకుంటారు.

50 ఓవర్ల ఆటలో అతని తెలివితేటలను చాలా మంది గుర్తుంచుకున్నప్పటికీ ఆస్ట్రేలియా టీమ్ లో జోన్స్ అత్యుత్తమ క్షణం 1986 లో చెన్నైలో దారుణమైన పరిస్థితుల్లో సాహసోపేతమైన ఇన్నింగ్స్ ఆడి 210 పరుగులు సాధించటం అనటం నిర్వివాదాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here