2020 నాటికి రైతుల ఆదాయం రెండింతలవుతుందని ప్రధానితో సహా పలువురు మంత్రులు పదే పదే చెప్పారు. మరి అలా జరిగిందా? రైతుల ఆదాయం డబుల్ కాలేదు..కాని రైతు ఆత్మహత్యలు మాత్రం రెండింతలు పెరిగాయని కేరళ కు చెందిన సీపీఎం ఎంపీ రాజ్య సభ సభ్యుడు కె.కె. రాగేష్ ప్రభుత్వాన్ని విమర్శిచారు. వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన మాట్టాడుతూ మోడీ సర్కార్ తెస్తున్న వ్యవసాయ బిల్లులు రైతులను కార్పోరేట్ శక్తుల దయా దాక్షిణ్యాలపై బతికేలా మారుస్తాయని మండిపడ్డారాయన.