బాబును నారాయణ అంతమాటన్నారా..

0
161

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ జైలుకు వెళ్లడం వల్లే ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా జైలుకెళ్తే ఆయనకే మంచిదన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ కేంద్రంపై మాత్రమే కాక, రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై మండిపడ్డారు.
ఈ వ్యవసాయ బిల్లులను ఇప్పటికే ఆరేడు రాష్ట్రాలు వ్యతిరేకించాయని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కేంద్రం ముందు మోకరిల్లాయని నారాయణ మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన వారే హీరోలని తేల్చి చెప్పారు. సీఎం జగన్‌ కేంద్రానికి మద్దతు ఇవ్వక తప్పదని, ఆయన వ్యతిరేకిస్తే మరుసటి రోజే జైలుకు వెళ్తారన్న సంగతి ఆయనకు తెలుసన్నారు. అయితే చంద్రబాబుకు భయం ఎందుకని ప్రశ్నించారు.

https://youtu.be/CrVrfMa17rw?t=34

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here