కరోనా దెబ్బతో అమ్మకానికి 1000 పాఠశాలలు!

2
212

విద్యారంగానికి కరోనా పెద్ద శాపంగా పరిణమించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 1,000కి పైగా కేజీ నుంచి పన్నెండవ తరగతి పాఠశాలలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రెండు-మూడే ళ్ళలో 7,500 కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చుకోవాలని ఆశించిన ఆ పాఠశాలల ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. విద్యా రంగాన్ని అది ఎంత బలంగా దెబ్బతీసిందో దీనిని బట్టి అర్థమవుతుంది.

విద్యా మౌలిక సదుపాయాల రంగంలోని పేరెన్నికగన్న సెరెస్ట్రా వెంచర్స్ అందించిన లెక్కల ప్రకారం మన దేశంలో 50 వేల వార్షిక ఫీజు వసూలు చేసే పాఠశాలలే అధికం. దేశంలో 80% పాఠశాల విద్య ఈ విద్యా సంస్థల ద్వారానే అందుతుంది. అయితే ప్రస్తుతం ఈ పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నారు. టీచర్ల జీతాలతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులు భరించటం వారికి తలకుమించిన భారంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలేమో ఫీజులపై పరిమితులు విధించాయి. ఫలితంగా ఈ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమైంది. పరిస్థితి నిత్య పోరాటం గా మారింది.

పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలు సైతం టీచర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని సంస్థ లు జీతాల్లో ఏకంగా 70 శాతం వరకు కోత పెట్టాయి. అప్పులు చేసైనా ఈ కష్టకాలం నుంచి బయటపడ దామంటే అదీ సాధ్యం కావట్లేదు. రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు వెనకాడుతున్నాయి. తిరిగి ఎలా చెల్లిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతారన్నదానిపై యాజమా న్యాలకు స్పష్టత లేదు. దాంతో రుణ సంస్థల నుంచి నిధులు రావడం కష్టమైంది.

వందల కోట్ల టర్నోవర్ కలిగిన చైన్ స్కూల్ప్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. తమ విద్యా సంస్థలను మరింత విస్తరించాలనుకున్న వారి ఆశలపై కోవిడ్ నీళ్లు చల్లింది. సాధారంగా ప్రైవేట్ పాఠశా లల ప్రమోటర్లు వివిద రంగాలకు చెందిన వ్యాపారులే. వారిలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఇంకా ఎక్కువ. ఈ నేపథ్యంలో వారి ఇతర వ్యాపారాలపై కోవిడ్ చూపిన ప్రతికూల ప్రభావం పాఠశాలల బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపింది.

ప్రస్తుత సంక్షోభంపై సెరెస్ట్రా భాగస్వామి విశాల్ గోయెల్ ఏమంటున్నారంటే.. వారి సంస్థకు 30 నుండి 40 కెజి- క్లాస్ 12 పాఠశాలలు ఉన్నాయి, అయితే ప్రస్తుతం ఈ సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాంతో స్కూళ్లను భవిషత్ లో నడపడానికి దాదాపు 1,400 కోట్ల రూపాయల పెట్టుబడి కావాలంటున్నా రయన. మరోవైపు నాణ్యమైన విద్యను అందించడానికి.. బలమైన వ్యూహాత్మకమైన లక్ష్యంతో యూరోకిడ్స్ ఇంటర్నేషనల్ విద్యాసంస్థను స్థాపించామన్నారు దాని వ్యవస్థాపకుడు ,గ్రూప్ సిఇఒ ప్రజోద్ రాజన్.. ఈ గ్రూపుకు 30 కి పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే ఈ సంస్థ కూడా ప్రస్తుతం సంక్షోభంతో పోరాడుతోందని ఆయన అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ , కర్నాటక, తెంలగాణలో 20 నుండి 25 పాఠశాలలు ఉన్నాయని.. వాటిని అమ్మడం గురించి ఆలోచిస్తున్నామని లోస్ట్రో అడ్వైజర్స్ భాగస్వామి రాకేశ్ గుప్తా అన్నారు.

గత సంవత్సరం, హాంకాంగ్ కు చెందిన నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ భారతదేశంలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ నుండి చైన్ పాఠశాలలను కొనుగోలు చేసింది. వీటిలో హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మరియు మొహాలిలోని పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలను రూ .1,600 కోట్లకు కొన్నారు. కానీ ఇప్పుడు ఇవే పాఠశాలలను విక్రయించాలంటే మాత్రం 30 నుండి 40 శాతం తక్కువకు అడుగుతున్నారు. మొత్తానికి కరోనా మహమ్మారి ప్రైవేటు విద్య సంస్థలపై పగబట్టిందని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పరిస్థితి ఇలావుంటే ..ఆ స్కూళ్లపై ఆధారపడిన వేలాది కుటుంబాలు వీదిన పడ్డాయి. టీచర్లుగా పనిచేసిన వారు అసంఘటిత రంగంలో పనులు వెతుక్కునే పనిలో ఉన్నారు. మొత్తానికి ఈ జన్మలో మరిచిపోలేని విధంగా కోవిడ్ 19 వారి జీవితాలను అతలాకుతలం చేసింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here