ఒక్కరోజే 90 వేలకు పైగా కేసులు

0
31


భారత్ లో కరోనా రోజు రోజుకు వేగంగా పెరిగిపోతున్నాయి. కేవలం 24 గంటల్లో 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 41 లక్షలు దాటిపోయాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిన్‌ విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే 1065 మంది కరోనా బారినపడి చనిపోయారు. దాంతో , ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 70,626. కాగా ఇప్పటివరకు 31,80,866 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 77.3 శాతంగా ఉంది.

ఇక కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రపదేశ్ రెండో స్థానంలో ఉంది. కర్నాటక, ఉత్తరప్రదేశ్ మూడు నాలుగు స్థానాలలో ఉన్నాయి. ఇక ప్రపంచంలో కేసుల పరంగా అమెరికా, బ్రెజిల్ తరువాత స్థానం భారత్ దే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here