రోజూ 75 వేల‌కు పైనే….

0
128

దేశంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకు కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గ‌త నాలుగు రోజులుగా వెయ్యి మందికిపైగా క‌రోనాతో చ‌నిపోతుండ‌గా, వ‌రుస‌గా మూడో రోజు 75 వేల మందికిపైగా ప్రాణాంత‌క‌ వైర‌స్‌ బారిన ప‌డ్డారు. శుక్రవారం రికార్డు స్థాయిలో 77,266 పాజి‌టివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి ‌కొంచెం త‌క్కువ‌గా 76 వేలు రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 34 ల‌క్ష‌ల మార్కును దాటాయి.
దేశంలో గ‌త 24 గంట‌ల్లో 76,472 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు 34,63,973కు పెరిగారు. ఇందులో 7,52,424 మంది చికిత్స పొందుతుండ‌గా, మ‌రో 26,48,999 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి నేటి ఉద‌యం వ‌ర‌కు 1021 మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతులు 62,550కి చేరారు.
నిన్న కంటే యాక్టివ్ కేసులు 10,401 పెర‌గ‌గా, ఒక్క‌రోజులో 65,050 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.90 శాతం ఉండ‌గా, కోలుకున్నారు 76.28 శాతానికి పెరిగారు. అదేవిధంగా మృతులు 1.82 శాతంగా ఉన్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.
శుక్రవారం ఒకేరోజు 9,28,761 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 28 వ‌ర‌కు 4,04,06,609 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here