ఏపీలో ఆగని కరోనా విళయ తాండవం ..10,603 పాజిటివ్ ‌, 88 మరణాలు

0
79

పిలో కరోనా విళయతాండవం చేస్తోంది. గత ఐదు రోజులుగా పది వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అదే స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,077 నమూనాలు పరీక్షించగా 10,603 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767 కు చేరింది. కొత్తగా 88 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 3884 చేరింది. తాజా పరీక్షల్లో 33,823 ట్రూనాట్‌ పద్ధతిలో, 29,254 పద్ధతిలో చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,21,754. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 36,66,422కు చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here