బిగ్ బాస్ హౌస్ లోకి రాధే మా….!

9
339


మీకు రాధే మా గుర్తుంది కదా.. అదేనండీ గాడ్ ఉమెన్ గా చెప్పుకుంటూ వింత వింత దుస్తులు వేసుకుని..వింవింద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద ఆధ్యాత్మికురాలు రాధేమా. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ 14 ద్వారా బిగ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్. సల్మాన్ ఖాన్ షో బిగ్ బాస్ కొత్త సీజన్ అక్టోబర్ లో ప్రారంభమవుతుంది. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ రియాలిటీ షోలో మొత్తం 16 మంది పాల్గొంటారు. అయితే ఈ సారి బిగ్ బాస్ లో వివాదాస్పద గాడ్ మదర్ రాధే మా కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికండా ప్రకటించలేదు. అయితే బిగ్ బాస్ 14 కోసం రాధే మాను సంప్రదించారు. వివాదాస్పద మహిళా ఆధ్యతిక గురువుగా జనానికి తెలిసిన రాధే మా అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. బిగ్ బాస్ నిర్వాహకులు గత సీజన్లో కూడా ఆమెను సంప్రదించారు. కానీ అప్పుడు ఆమె షోలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. అయితే ఈ బిగ్ బాస్ 14కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది..


కరోనావైరస్ నేపథ్యంలో దేశంలో ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమిత మవుతు న్నారు. చాలా మంది గంటలకు గంటలు టీవీలకు అతక్కుపోతున్నారు. దీంతో ఇప్పటికే పాపులర్ అయిన బిగ్ బాస్ షో మరింత ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. కాసుల వర్షం కురిపించుకునేందుకు వీలుగా షోకు రంగులు అద్దుతోంది. బిగ్ బాస్ 14 పై విపరీతమైన అంచనాలున్నాయి. మొదట ఈ కార్యక్రమం సెప్టెంబర్ నెలలో ప్రసారం అవుతున్నట్లు వార్తలువచ్చాయి, కాని ఇప్పుడు అక్టోబర్లో ప్రసారం అవుతు న్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రదర్శనలో ఎవరు పాల్గొంటారనే దానిపై హాగానాలు కూడా ప్రారం భమయ్యాయి. వాటిలో రాధే మా ఎంట్రీ ఒకటి. పంజాబ్ లోని గురుదాస్‌పూర్ జిల్లాలో జన్మించిన రాధే మా చిన్నప్పటి నుండే భక్తి మార్గం పట్టారు. ఆమె ధరించే వింత వింత బట్టలతో పాటు , ఆమె మాటలు కూడా విచిత్రంగా ఉంటాయి. వివాదాస్పద ప్రకటనలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. అనుకుంటున్నట్టుగా ఆమె బిగ్ బాస్ లోకి వెళితే తోటి పార్టిసిపాంట్స్ ఆమెతో ఎలా సర్దుకుపోతారన్నది ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే ఆమె ఎన్ని రోజులు బిగ్ హౌస్ లో ఉండగలుగుతుందో చూడాలి.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here