స్వీడన్‌లో మత ఘర్షణలు

0
91

పలువురు పోలీసులకు గాయాలు
10 మంది నిరసనకారుల అరెస్టు

స్వీడన్‌లో అల్లర్లు చెలరేగాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి మత ఘర్షణలు తలెత్తాయి. ముస్లిం వ్యతిరేక డానిష్‌ రాజకీయ నాయకుడు ఖురాన్‌ ప్రతులను దహనం చేసేందుకు ఒక ర్యాలీ చేపట్టేందుకు యత్నించాడు. దాంతో ఈ ఘర్షణలకు దారితీసినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు సదరు రాజకీయ నేతను అడ్డుకున్నారు. అనంతరం అక్కడున్న పోలీసులపైకి రాళ్లు రువ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు.


టైర్లను, బాణాసంచా కాల్చి నిరసన తెలిపారు.
ఈ ఘర్షణల్లో పలువురు పోలీసు అధికారులకు గాయపడ్డారని పేర్కొన్నారు. 10 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. మాల్మో వీధుల్లో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారని చెప్పారు. ఇస్లామిక్‌ పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ కాపీలను తగులబెట్టిన ఘటనను వ్యతిరేకిస్తూ దాదాపు 300 మంది ఆందోళన చేపట్టినట్లు పోలీసు అధికారుల ప్రతినిధి లుండ్‌క్విస్టు స్వీడిష్‌ టాబ్లాయిడ్‌కు తెలిపారు. ఈ హింసాకాండ ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు.
ఎవరీ రాస్ముస్ పలుడాన్?
పలుదాన్ ఓ డానిష్ రాజకీయ నాయకుడు. న్యాయవాది కూడా. 2017 లో ఫార్ రైట్ పార్టీ స్టామ్ కుర్స్ ను స్థాపించాడు. అంతేకాక యూట్యూబ్ లో ముస్లిం వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేశాడు. వాటిలో ఖురాన్ ను కాల్చినట్టు ఉంది. ఫ్రీ స్పీచ్ కి ఇది నివాళి అంటూ ఆయన వాటిని సమర్థించాడు.


జూన్ లో పలుడాన్ తన పార్టీ సోషల్ మీడియా ఛానెళ్ళలో ఇస్లాం వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు జాత్యహంకార ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడటంతో అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. దాంతో పాటు జాత్యహంకార ప్రసంగం చేసినందుకు 2019 లో అతనికి 14 రోజుల షరతులతో కూడిన జైలు శిక్ష విధించబడింది. జూన్ లో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. జాత్యహంకారం, పరువు నష్టం ,ప్రమాదకర డ్రైవింగ్ సహా 14 కేసులలో అతను దోషిగా తేలింది.
గత డానిష్ ఎన్నికలలో 300,000 మందికి పైగా ముస్లింలను డెన్మార్క్ నుండి బహిష్కరించడం, అలాగే ఇస్లాంను నిషేధించడం అనే విధానంతో పాలూడన్ పార్లమెంటులో అడుగు పెట్టాలని బావించాడు. ఇదిలావుంటే, పలుడాన్ స్వీడన్ లోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. రెండేళ్ల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here