కేసీఆర్ పై ఐక్య పోరాటానికి ప్రజా వేదిక?

16
341

కేసీఆర్ పై ఐక్య పోరాటానికి ప్రజా వేదిక?
కోదండరామ్ నాయకత్వానికి రేవంత్ మద్దతు
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో ఉమ్మడి పోరు
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా వేదికపై సంకేతాలు


తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటానికి ఐక్య వేదికగా దిశగా అడుగులు పడు తున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో ఉమ్మడి పోరుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. కృష్ణా బేసిన్ లో ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులే అస్త్రంగా కేసీఆర్ ను టార్గెట్ చేసేలా విపక్షాలు ఉద్యమ కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నాయి. తె లంగాణ ఉద్యమాన్ని ముందుడి నడిపిన టీజేఏసీ చైర్మెన్, తెలంగాణ జన సమితి అ ధ్యక్షుడు కోదండరామే ఉమ్మడి పోరాటానికి నాయకత్వం వహించేలా .. ఆయనపై వివి ధ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. త్వరలోనే పార్టీలకతీతంగా ప్రజా వేదిక ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా ప్రజా వేదిక నుంచి కేసీఆర్ సర్కార్ పై సమరానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా వేదికపై సంకేతాలు వచ్చాయి. తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి మరో ప్రజా ఉద్యమానికి నాంది పలకాలని వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాలు, సాగునీటిరంగ నిపుణులు ముక్తకంఠంతో నినదించారు. లిఫ్ట్ పేరుతో, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణను ఆర్థికంగా దోచుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ ను దింపింతే తప్పా తెలంగాణ మంచిరోజులు రావన్నారు. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీని పక్కనపెట్టి.. ఒక ప్రజా వేదికను ఏర్పాటు చేస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.


కేసీఆర్ చేస్తున్న మోసాన్ని, నైజాన్ని ప్రజలకు తెలిపి, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. కేసీఆర్ కుట్రను ఛేదించడానికి అందరూ ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలిపునిచ్చారు. ప్రజా వేదికతో కలిసి పనిచేస్తామని చెప్పారు. క్రిష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల అడ్డంకిని తొలగించడానికి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రజా వేదిక ద్వారా పోరాటానికి మద్దతుగా ఉంటామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. అన్ని ప్రతిపక్షాలు ఏకమై కేసీఆర్ మెడలు వంచాల్సిన సమయం వచ్చిందని జర్నలిస్ట్ సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.


కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడానికి కోదండరామ్ నేతృత్వంలో ప్రజా వేదిక ఏర్పాటు కావాలని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే విపక్ష నేతల మధ్య చర్చ జరిగిందని, త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందని సమాచారం. ప్రజా వేదికపై ప్రజల్లో చర్చ జరగాలన్న ఉద్దేశ్యంతోనే రేవంత్ ప్రకటన చేశారని భావిస్తున్నారు. అన్ని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమైతే .. కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, వివేక్ లు తాము కలిసి వస్తామని ప్రకటించారు కాని.. వారి పార్టీల స్టాండ్ ఏంటన్నది తేలాల్సి ఉంది. ఇక ప్రజా వేదిక ఏర్పాటు ప్రయత్నాలపై టీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. అధికారిక ప్రకటన వచ్చాకే గులాబీ లీడర్లు స్పందించే అవకాశం ఉంది.
-ఎస్.ఎస్. యాదవ్, సీనియర్ జర్నలిస్ట్

16 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here