ఇడుపులపాయకు సిఎం జగన్

47
371

రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా రేపు(బుధవారం) జరిగే మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గనేందుకు  సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కడపకు వెళ్లారు.  విమానాశ్రయం వద్ద జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సిఎంతో పాటు ఆయన సతీమణి వైఎస్‌.భారతి, ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి ఉన్నారు.

47 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here