హత్యకు గురైన హేమంత్ కిడ్నాప్ సీసీ టీవీ ఫుటేజ్

58
390

హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న హేమంత్ కుమార్ హత్యలో సిసిటివి ఫుటేజ్ బయటపడింది. పోలీసులు ఆయన మృతదేహం శుక్రవారం సంగారెడ్డిలో కనుగొన్నారు. హేమంత్ భార్య అవంతి కుటుంబ సభ్యులతో పాటు కిరాయి గుండాల బారి నుంచి హేమంత్ తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఈ ఫుటేజ్ చూపిస్తుంది. నల్ల చొక్కా , తెలుపు ప్యాంటు ధరించి వున్న హేమంత్, ఎరుపు రంగు ఫోర్ వీలర్ ఆగినప్పుడు అతను బయటకు వచ్చారు. వెంటనే కిడ్నాపర్లు కూడా బయటికి వచ్చి అతనిని కొట్టడం ప్రారంభించారు. తరువాత గోపన్ పల్లి వద్ద అతడిని బలవంతంగా మరొక వాహనంలోకి లాగారు.

ఇంతలో, మరొక వాహనంలో ఉన్న అవంతి తప్పించుకోగలిగింది. బయటకు వచ్చిన భయంతో పరుగులు తీసి బహుశా సాయం కోసం ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ ఫుటేజ్ లో చూడవచ్చు. తరువాత వాహనాలు హేమంత్ ని తీసుకుని వెళ్లిపోయాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ హత్య కిరాయి హంతకుల బృందం పనే అని ‘క్లియర్ కట్’ గా తెలిపోయింది. అ హత్యకు వారు రూ .10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అవంతి తండ్రి డోంతి రెడ్డి లక్ష్మరెడ్డి, ఆమె మేన మామ యుగందర్ రెడ్డి ఈ హత్య చేయించారు. మర్డర్ ప్లాన్ అమలు చేయడానికి కిరాయి గూండాలకు అడ్వాన్స్ ఇవ్వటానికి యుగంధర్ కు లక్ష్మారెడ్డి లక్ష రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

వైర్ తో చేతులు, కాళ్లు కట్టేసి హేమంత్ గొంతు కోశారు. వాహనం లోనే అతడిని హత్య చేసి తరువాత మృతదేహాన్ని గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సంగారెడ్డి శివార్లలోని ఒక నిర్జన ప్రదేశంలో కారు లో నుంచి విసిరేశారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన హేమంత్ హత్యకు కారణం కులమేనని అనుమానిస్తున్నారు. అవంతి రెడ్డి కులానికి చెందినవారు. అయితే, ఈ హత్యలో ఆస్తి కోణం కూడా ఉందా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హేమంత్ , అవంతి గత జూన్ లో వివాహం చేసుకున్నారు. అవంతి కుటుంబానికి ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. అవంతి అప్పుడే సెటిల్ మెంట్ కింద తన పేరిట ఉన్న అన్ని ఆస్తులను కటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఆమె మీడియా ప్రకటనలో తెలిపింది.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 302 (హత్య), 323 (స్వచ్ఛందంగా బాధ పెట్టినందుకుశిక్ష), 120 బి (నేరపూరిత కుట్ర), 365 (కిడ్నాప్ శిక్ష), 452 (అతిక్రమణ), 509 (ఏ మహిళ యొక్క నమ్రతను అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ), భారత శిక్షాస్మృతి యొక్క 506 (క్రిమినల్ బెదిరింపు) గచ్చిబౌలి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

58 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here