ఆమెకు 27..అతనికి 57 ..బ్రాడ్ పిట్ కొత్త రొమాన్స్ ..

0
58

హాలీవుడ్ హంక్ బ్రాడ్ పిట్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. అది కూడా తనకన్నా దాదాపు 30 సంవత్సరాలు చిన్నదైన ఒక జర్మన్ మోడలతో ప్రేమాయణం మొదలు పెట్టాడు.ఇప్పుడు వీరి రొమాన్స్ హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టన్‌తో పిట్ సన్నిహితంగా ఉంటున్నాడన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్న సమయంలో అతను కొత్త అమ్మాయితో డేటింగ్ సన్నివేశం తెరమీదకొచ్చింది.


సిటీ ఆఫ్ రొమాన్స్ పారిస్‌లోని 56 ఏళ్ల ఈ హాలీవుడ్ నటుడు 27 ఏళ్ల జర్మన్ మోడల్ నికోల్ పోటురల్స్కితో ‘ముద్దు’ సన్నివేశం కెమెరా కంటికి చిక్కింది. బ్రాడ్, నికోల్ మధ్య ఏజ్ గ్యాప్ పెద్ద విషయం కాదు. హాలీవుడ్ హీరోలకు ..మిలియనీర్ బిజినెస్ టైకూన్లకు ఇది మామమూలే.

ఇప్పుడు ఈ జంట అప్పుడే ప్రేమలో పడిన టీనేజ్ లవర్స్ లా విహరిస్తున్నారు. ప్రైవేట్ జెట్‌లో ఫ్రాన్స్‌ లోని బ్రాడ్ విడిదికి వెళ్లి ..అక్కడే తమ హాలిడే సమాయం గడుపుతున్నట్టుగా కనిపిస్తోందని మిర్రర్ పత్రిక పేర్కొంది.


ఏంజెలీనా జోలీతో బ్రాడ్ పెళ్లి పెటాకులయి నాలుగేళ్లవుతోంది. తరువాత కొంత మందితో వ్యవహారం నడిపినట్టు వార్తలు వినిపించాయి. కాని అందులో నిజం ఎంతో ఎవరికీ తెలియదు. కాని నికోల్ విషయం ఇప్పటికే బయటపడింది. ఇదిలావుంటే నికోల్ కు ఓ కొడుకున్నాడు. ఐతే ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమారుడితో ఉన్న కొన్ని ఫోటోలు మాత్రమే షేర్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here