కంగనకు ఏమైంది..

1
136


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినప్పటి నుంచి నటి కంగనా రౌత్ నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. వివాదాస్సద కామెుంట్లతో బాలివుడ్ పై విరుచుకుపడుతున్నారామె. సినీ మాఫియా కంటే ముంబై పోలీసులు అంటేనే భ‌యంగా ఉంద‌ని కామెంట్స్ చేసి సంచలనం రేపింది. దాంతో శివ‌సేన నాయ‌కులు కంగ‌నాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ముంబైలో అడుగుపెట్ట‌నివ్వొద్ద‌ని అన్నారు. దీంతో నన్ను అడుగు పెట్టవద్దు అనేందుకు ముంబయి ఏమైనా పీఓకే (పాక్ అక్రమిత కశ్మీరా )నా, తాలీబాన్ల రాజ్యమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగన వ్యాఖ్యలు ముంబై చిత్ర పరిశ్రమను డిఫెన్స్ లో పడేశాయి. దాంతో పలువురు నటీనటులు కంగనపై మండిపడుతున్నారు.

ఎందరో సెల‌బ్రిటీల‌కు ఉపాధి క‌ల్పించిన ముంబైను పీఓకే తో పోల్చినందుకు సోనూసూద్‌ ఫైర్ అయ్యారు. ముంబై ఎవరి తలరాతనైనా మారుస్తుంది. న‌మ‌స్క‌రిస్తే పుర‌స్కారం ల‌భిస్తుంద‌ని సోనూ ట్వీట్ చేశారు. రితేష్ దేశ్ ముఖ్, దియా మీర్జా, స్వ‌ర‌భాస్క‌ర్ వంటి సెల‌బ్రిటీలు కూడా ముంబైతో ఉన్న అనుబంధం గురించి తెలిపారు. ఐ ల‌వ్ ముంబై అనే క్యాంపెయిన్ కూడా మొద‌లు పెట్టాల‌ని భావిస్తుండ‌గా, ఇందులో ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది
కంగన వ్యాఖ్యల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కు బాలీవుడ్ తారలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుబు కంగన నోరు మూయించకపోతే ముందు ముందు బాలీవుడ్ పరిశ్రపై దాని ప్రభావం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరి కంగనను కట్టడి చేయటానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి.

కంగన రనౌత్ పై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శుక్రవారం జరిగిన ఆందోళనలో ఓ కార్యకర్త కంగన పోస్టర్లను చెప్పుతో కొట్టటం కనిపించింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here