ముంబయి నగర పాలక సంప్థ బిఎమ్సిపై బుధవారం బాలీవుడ్ కంగనా రనౌత్ ఘన విజయం సాధించినట్టయింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ( బిఎంసి) బాంద్రా పాలిహిల్స్ లోని ఆమె కార్యాయలంలో 14 ఉల్లంఘనలు జరిగాయని జాబితా సిద్ధం చేసింది. వంటగది స్థలంలో టాయ్ లెట్, అాగే టాయిలెట్ కోసం ఉద్దేశించిన ప్రదేశంలో ఆఫీసు ఏర్పాటు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. బిఎంసి ప్రవర్తన దురుద్దేశ పూర్వకమైనది, దుర్భలమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చిన కంగనా రనౌత్ కొన్ని నెలల విరామం తర్వాత తీవ్ర వివావం నడుస్తున్న సమయంలో మనాలి నుండి బుధవారం ముంబైకి తిరిగి వచ్చింది.
కార్పొరేషన్ ఉన్నట్టుంది అకస్మాత్తుగా నిద్ర మత్తు వీడినట్టు పిటిషనర్ కు నోటీసు జారీ చేసిందని. అది కూడా ఆమె రాష్ట్రం వెలుపల ఉన్నప్పుడు. వ్రాతపూర్వక అభ్యర్థన ఉన్నప్పటికీ 24 గంటలలోపు స్పందించమని ఆమెను ఆదేశించింది. ఆమెకు ఎక్కువ సమయం ఇవ్వలేదు. 24 గంటలు పూర్తయిన వెంటనే ప్రాంగణాన్ని పడగొట్టడానికి ముందుకు సాగడాన్ని కోర్టు గుర్తించింది. అంతేకాదు, నగరంలో అనేక అనధికార నిర్మాణాల పట్ల బిఎంసి ఇదే వేగంతో వ్యవహరిస్తే ఈ నగరం ఓ భిన్నమైన నివాసం ప్రదేశంగా ఉండేదని చెప్పటం తప్ప ఇంకేమీ చేయలేని అసహాయులం అంటూ వ్యాఖ్యానించింది.
బిఎమ్సి కోర్టు సమయాన్ని వృథా చేయడానికి ప్రయత్నిస్తూనే కూల్చివేతను పూర్తి చేసిందని, పిటిషనర్ అత్యవసర ఉత్తర్వులను కోరుతూ ఏ క్షణంలో అయినా ఈ కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేస్తారనే విషయం బిఎమ్సికి బాగా తెలుసు. అందుకే బిఎమ్సి వ్యవహార శైలి దుర్భరమైనదిగా గుర్తించామని కోర్టు తెలపింది.. వీటన్నిటికి సమాధానం చెప్పవలసిందిగా బిఎంసి కి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.