మహా సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది ..

0
120

కంగన ఇల్లు కూల్చివేతపై మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ స్పందించింది. శివసేన నేతృత్వంలోని ఎంవిఎ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయంగా కూల్చివేతను అభివర్ణించింది. ఇది రాష్ర్టంలో ఒక రకమైన ప్రభుత్వ ప్రాయోజిత టెర్రర్ అని పేర్కొంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాష్ట్రం ఇంతకు ముందెప్పుడు ఇలాంటి దుర్బల, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వాన్ని చూడలేదని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే గొంతుకలను ప్రభుత్వం నులిమేస్తోందని ఫడ్నవిస్ ఆరోపించారు.


సినీ నటి కంగనా రనౌత్ ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చినప్పటి నుంచి శివసేనతో ఆమెతో మాటల యుద్ధం చేస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులకు తాను ఎక్కువ భయపడుతున్నానని కంగనా అనటం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (బుధవారం) బ్రుహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) సిబ్బంది బాంద్రాలోని పాలి హిల్ లో గల కంగన బంగ్లాలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో వివాదం మరింత తీవ్రతను సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here