జగన్ కి హాయ్.. కేసీఆర్ కు బై… కమలం కొత్త దోస్తానా!

0
154

టీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందా?.. టీఆర్ఎస్ కలిసిరాకున్నా కేంద్రంలో నష్టం లేదని కమలం భావిస్తుందా?.. గులాబీ బాస్ బీజేపీని టార్గెట్ చేస్తోంది అందుకేనా? అంటే అవుననే సమాధానమే వ స్తోంది. గతంలో కేంద్ర బిల్లుల ఆమోదానికి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎ స్ మద్దతు తీసుకుంది ఎన్డీఏ సర్కార్. కాని ప్రస్తుతం మాత్రం సీన్ మారింది. టీఆర్ఎస్ మద్దతు అవ సరం లేదనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే త్వరలో జరగనున్న రాజ్య సభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు కోరడం లేదు.

ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షా కాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగబో తోంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్నే మరోసారి అభ్యర్ధిగా నిలబెట్టింది ఎన్డీయే. ఎగువసభలో తమకు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆయనకు మిగతా పార్టీల మద్దతు కూడగడుతోంది బీజేపీ కూటమి. రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్న వైసీపీ మద్దతు కోరింది. హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు మద్దతివ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఫోన్‌ చేశారు. గతంలో హరివంశ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ చేసేందుకు వైసీపీమద్దతిచ్చింది. దీంతో మరోసారి తమ మద్దతు కొనసాగించాలని నితీశ్‌ కోరగా.. జగన్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.

రాజ్యసభలో టీఆర్ఎస్ కు ఏడుగురు సభ్యులున్నారు. అంటే వైసీపీ కంటే ఒకరు ఎక్కువే. కాని ఇంతవరకు ఎన్డీయే కేసీఆర్ ను మద్దతు కోరలేదు. బీహార్ సీఎం నితీశ్ తో కేసీఆర్ కు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలున్నాయి. అయినా నితీశ్ కుడా టీఆర్ఎస్ మద్దతు కోసం ప్రయత్నించడం లేదు. బీజేపీ సూచనల ప్రకారమే జగన్ తో మాట్లాడిన నితీశ్.. కేసీఆర్ తో కాంటాక్ట్ కాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కు కారు పార్టీ ఎంపీలు మద్దతిచ్చారు. గత ఆరేండ్లుగా కేంద్రంలో మోడీ సర్కార్ తో మంచి సంబంధాలు కొనసాగించింది టీఆర్ఎస్. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు మద్దతు ఇచ్చింది. అయితే కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య తేడాలు వచ్చినట్లు సమాచారం.

గతంలో ప్రధాని మోడీని ప్రశంసించిన సీఎం కేసీఆర్.. ఇటీవల మాత్రం కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారని, న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రంతో సమరానికి సిద్ధమంటున్నారు గులాబీ బాస్. బీజేపీతో తనతో సరిగా వ్యవహరించడం లేదనే కారణంగానే కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను గమనిస్తున్న బీజేపీ.. ఆయన్ను దూరం పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ సపోర్ట్ అవసరం లేదనే భావనలో బీజేపీ.. కేంద్రంతో పోరాడాలనే యోచనలో కారు పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల తరఫున మనోజ్‌ ఝాను నిలబెట్టాలని కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఆయనకు కాంగ్రెస్‌, ఆర్జేడీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాలు మద్దతివ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 87, కాంగ్రెస్ కు 40 మంది సభ్యులున్నారు. బలాబలాల ప్రకారం మరోసారి ఎవ్డీయే అభ్యర్ధికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

-S.S.Yadav, Senior Journalist

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here