మోడీ సరే…మరి కేసీఆర్ చేసిందేమిటి?

0
110

కేంద్రం మీద రాష్ట్ర ముఖ్యమంత్రులు విమర్శలు చేసే ముందు వారు ఓ విషయం గుర్తు సెట్టుకో్వాలి తాము తమ రాష్ట్రాలలో ఏం చేస్తున్నామని. ముఖ్యమైన విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ, ముఖ్యమైన చట్టాలు చేసేప్పుడు విపక్షంతో చర్చించి చేస్తున్నారా. ఎక్కడ చూసినా ఏక పక్షమే కదా. అలాంటప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయాల మీద , చేసే చట్టాల మీద గగ్గోలు పెట్టటం ఎందుకు. అసలు వారికి ఆ నైతికత ఉందా. ఏదో జనం చూడటానికి అలా పైపై మాటలే కాని వారికి నిజం చిత్త శద్ధి ఉందా? మిగతా రాష్ట్రాల విషయం ఏమో కానీ తెలంగాణ విషయమే తీసుకుంటే బీజేపీ ఎంపీ డి. అరవింద్ ఈ వాదనే చేస్తున్నారు.

కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని టిఆర్ఎస్ పార్టీ సైతం వ్యతిరేకిస్తోంది . పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంలోనూ వ్యతిరేకంగా ఓటు వేసి తమ నిరసన తెలియ చేసింది. అయితే టిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవసాయ చట్టంపై విమర్శలు చేస్తున్న నేపద్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటి అని నిలదీశారు. వీఆర్వోల తొలగింపుపై ప్రతిపక్షాలతో చర్చ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇందులో లాజిక్ ఉంది కదా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here