ఎట్టకేలకు ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ని బీసీసీఐ ప్రకటించింది. ఎన్నో తర్జనభర్జనల అనంతరం ముహూర్తం ఖరారు చేసింది. ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ ఈ నెల 19న జరగనుంది. యూఏఈ వేదికగా జరగనున్న డ్రీమ్ 11 ఐపీఎల్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్ప్ మధ్య మ్యాచ్ జరగనుంది. అబుదాబిలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 20న దుబాయ్లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్, 21న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు, 22న రాజస్థాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, 23న కోల్కతా వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 3 వరకు ఐపీఎల్ 13 వ సీజన్ కొనసాగుతుంది. కరోనా భయాలతో అల్లాడిపోతున్న జనానికి రెండు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రూపంలో కాస్త ఎంటర్టైన్మెంట్ లభించనుంది.