కరోనాతొ పోరాడుతున్న ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆకోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది, అయినా వెంటిలేటర్ మీదే ఉన్నారని ఆయన కుమారుడు చరణ్ అన్నారు. బాలు హెల్త్ పై తాజా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కారోనా కారణంగా ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ఎదురైంది. ప్రస్తుతం దానికి చెన్నయ్ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్ప జరుగుతోంది. నయం కావటానికి ఇంకా సమయం పడుతుందని చరణ్ పేర్కొన్నారు, దీంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఐప్యాడ్‌లో టెన్నిస్, క్రికెట్ చూస్తూ బాలు సమయం గడుపుతున్నారని చెప్పారు చరణ్.