తమిళ హీరోతో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్ ..

51
324

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కొంత కాలంగా తనతో ప్రేమలో ఉన్న త‌మిళ హీరో విష్ణు విశాల్ ని పెళ్లి చేసుకోనుంది. ఇది ఇరువురికి రెండో వివాహం. అతడు త‌న భార్య ర‌జనీ నుండి న‌వంబ‌ర్ 13,2018న విడిపోయాడు. అప్ప‌టి నుండి బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల‌తో రిలేష‌న్‌లో ఉంటున్నాడు. వీరిద్ద‌రు చెట్టాప‌ట్టాలు వేసుకుంటూ, స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోల‌ని సోష‌ల్ మీడి యాలో షేర్ చేస్తూ వ‌చ్చారు. వారి ఫోటోల‌ని చూసిన నెటిజ‌న్స్ త్వ‌ర‌లో ఒక్క‌టి అవ్వ‌డం ఖాయం అని జోస్యం చెప్పారు. అన్న‌ట్టుగానే ఈ రోజు విష్ణు విశాల్ , గుత్తా జ్వాల నిశ్చితార్ధం జ‌రుపుకున్నారు.
ఈ రోజు గుత్తా జ్వాల బ‌ర్త్ డే సంద‌ర్భంగా విష్ణు విశాల్ ఆమె చేతికి రింగ్ తొడిగి త‌మ ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్టు ప్ర‌క‌టించాడు.

హ్యాపీ బ‌ర్త్ డే గుత్తా జ్వాల‌.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మ‌న ఫ్యామిలీ, చుట్టు ప‌క్క‌ల వారి భ‌విష్య‌త్ అందంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అంద‌రి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్ద‌రాత్రి స‌యంలో ఉంగరం తీసుకొచ్చిన‌ గుత్తా మేనేజ‌ర్ బసంత్ జైన్ కు ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేశారు విష్ణు. అంతేకాకుండా త‌మ ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా షేర్ చేశారు.

వాస్తవానికి విష్ణు విశాల్‌కి 2010లోనే వివాహమయ్యింది. రజనీ నటరాజన్‌ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. మనస్పర్థలు కారణంగా 2018లో వారిద్దరు విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాలకి కూడా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో 2005లో వివాహమైంది. కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాల దేశంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది.

51 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here