తెలంగాణ సర్కార్ కు ఎపిఎస్‌ఆర్‌టిసి లేఖ

1
134

తంలో ఏపీ నుంచి తెలంగాణకు గల బస్సు సర్వీసులను మళ్లీ నడపాలనుకుంటు న్నామని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి కృష్ణబాబు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌, తెలంగాణకు బస్సు సర్వీసుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నా… ప్రభుత్వాలు ఇప్పటికీ విధాన నిర్ణయం తీసుకోని పరిస్థి తి ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి మరిన్ని సర్వీసులు పెంచుకోవాలని తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి కృష్ణబాబు లేఖ రాశారు. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాసి బస్సు సర్వీసులపై క్లారిటీ ఇచ్చారు. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సుల కంటే టిఎస్‌ ఆర్‌టిసి బస్సులు ఎపిలో తక్కువగా తిరిగేవి. ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల అధికారుల భేటీలో ఎపిఎస్‌ఆర్‌టిసి 1.12 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్‌టిసి కోరింది. ఎపిఎస్‌ఆర్‌టిసి అధికారుల మాత్రం 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, తెలంగాణ కూడా 56 వేల కిలోమీటర్లు సర్వీసులను పెంచుకోవాలని ప్రతిపాదించారు. ఈ లేఖపై టిఎస్‌ఆర్‌టిసి అధికారులు స్పందించాల్సి ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here