వైఎస్సార్‌కు నివాళి అర్పించిన జగన్

0
141

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. దివంగత నేత సతీమణి విజయమ్మ, జగన్ భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ అరగంట పాటు గడిపారు. తమ మధ్య నుంచి వైఎస్సార్ దూరమై నేటికి 11 ఏళ్లు నిండాయని ఆయన తన వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారని , ఆయన రూపొందించిన ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దని వైఎస్ జగన్ అన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ వైఎస్సార్ తోడుగా ఉంటారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here