తప్పులు జరిగిన వెంటనే యాక్షన్

1
117

రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా విళయతాండవం చేస్తోంది. నివారణ చర్యలపై సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

సీఎం సమీక్ష్ల ముఖ్యాంశాలు..
ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా ఇస్తున్నారా? లేదా? అన్నది కూడా వారు చూడాలి. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని అందించాలి. రోగులు సంతృప్తి చెందేలా ఆరోగ్య మిత్రలు సేవలు అందించేలా చూడాలి. ఒక ఆస్పత్రిలో రోగులకు వైద్యం సరిగా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్య మిత్రలదే. ఆరోగ్యశ్రీ అమలుపై ఎప్పటిక ప్పుడు నిశిత పర్యవేక్షణ చేయాలి. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసు కోవాలి. రిఫరల్‌ విధానం సమర్థవంతంగా ఉండాలి. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల మీద, వైద్య సేవల నాణ్యత మీద ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. ఆరోగ్య మిత్రలకు ప్రొటోకాల్‌పై సంపూర్ణ అవగాహన ఉండాలి..

కాల్‌ సెంటర్లకు అధికారులు రోజూ మాక్‌ కాల్‌ చేసి, వాటి పని తీరును పరిశీలించాలి. ప్రతి మాక్‌కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలి. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలు.. ఈ నాలుగింటిపై ప్రశ్నలు వేసి.. అన్ని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. వీటి ద్వారా ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలి. ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే వెంటనే పరిస్థితులను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య ఆసరా మీద కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. మనం తీసుకుంటున్న చర్యలపై రోగులంతా సంతృప్తి వ్యక్తం చేయాలి.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీచింగ్‌ ఆస్పత్రుల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయి. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నిర్మాణంపైనా చర్యలు తీసుకోవాలి. (అక్టోబర్‌ నాటికి టెండర్ల ప్రక్రియ ముగిస్తామని అధికారులు చెప్పారు.) ఈ సమీక్ష సమావేళంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు, పలువురు సీనియర్‌ స్థాయి ఉన్నతాధికారులుపాల్గొన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here