నేను సీతను కాదు..

0
189

ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించనున్న ఆదిపురుష్ ముఖ్య తారాగరణం ఎంపిక పూర్తి కాలేదు. రాముడుగా ప్రభాస్, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిఃస్తున్నారు. అయితే అతి ముఖ్యమైన సీత పాత్రను ఎవరు పోషించనున్నారన్నదానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కొందరు అనుష్క శెట్టి అంటే ..మరికొందరు అనుష్క శర్మ అంటున్నారు. ఇంకా నయన తార, కియారా అద్వానీ, కీర్తి సురేష్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా అనుష్క శెట్టి పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె నటిస్తున్నట్టు పక్కా సమాచారం ఉన్నట్టు వార్తలు రాస్తున్నారు.ఇదిలావుంటే, సీత పాత్రలో నటిస్తున్నట్టు వస్తున్న వదంతులపై అనుష్క స్పందించారు. తాను ఆదిపురుష్‌ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పేశారు.

ఇక అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటీటీ ప్లాట్‌ ఫాంలో విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైం వీడియోలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న స్వీటీ ఆదిపురుష్‌ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలావుంటే, ఆదిపురుష్ యూనిట్ సీత ఎవరో ఇప్పటి వరకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. బహుశా ఏ ఇమేజ్ లేని కొత్త తారను సీత పాత్రకు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర దర్శకుడు అదే పనిలో ఉన్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలగు, తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here