గ్రీన్..గులాబీ .. గ్రేటర్ డ్రామాకు తెర తీశాయా…!

127
737


తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం మొదటి నుంచి భాయ్ భాయ్. ప్రభుత్వం తీసుకువచ్చే అన్ని బిల్లులకు మజ్లిస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. కేసీఆర్ సర్కార్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తే… ఎంఐఎం తిప్పికొట్టిన సందర్భాలున్నాయి. ఎంఐఎం మాకు మిత్రపక్షమేనని సీఎం కేసీఆరే పలు సార్లు ప్రకటించారు. ఒవైసీ బ్రదర్స్ కు ప్రభుత్వంలోనూ మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఎంఐఎం తీరు మారింది. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అక్భరొద్దీన్ ఒవైసీ. కరోనా పై జరిగిన చర్చే ఇందుకు మంచి ఉదాహరణ. ప్రభుత్వ ప్రకటనపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయి లో మండిపటం గమనార్హం. అలాగే మంత్రి ఈటల ప్రసంగం హెల్త్‌ బులెటిన్‌తో పోల్చ టం వారి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పకనే చెబుతోంది. అన్ని అంశాలపై సర్కార్ కు సహకరిస్తున్నా రూల్స్ మాట్లాడుతున్నారంటూ స్పీకర్‌పై అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు, అక్భరుద్దీన్ కు టీఆర్ఎస్ నేతలు కౌంటరిచ్చారు. సీనియర్ సభ్యుడై నంత మాత్రాన అక్బర్ ఏదీ పడితే అది మాట్లాడతానంటే కుదరదని మంత్రి తలసాని అనటం దోస్తుల మధ్య ఏదో తేడా వచ్చిందనే అనుమానం కలిగిస్తుంది. బాధ్యతా ర హితంగా మాట్లాడితే ఊరుకునేది లేదనంటున్నారు గులాబీ నేతలు. ఓవర్ స్మార్ట్ గా అక్బర్ వ్యవహరించొద్దన్నారు వారు.

మంగళవారం అసెంబ్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వా లని కేంద్రాన్ని కోరుతూ ప్రభుత్వం తీర్మానం పెట్టింది. తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినా ఎంఐఎం సపోర్ట్ చేయలేదు. చర్చ జరుగుతుండగానే ఎంఐఎం సభ్యు లు వాకౌట్ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ పెట్టిన బిల్లు లేదా తీర్మానానికి ఎంఐఎం మద్ద తు ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు పెంచారు అక్బరుద్దీన్. కరోనా కట్టడిలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత అన్ని అంశాల్లో కలిసి నడిచిన టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఇప్పుడు జరు గుతున్న పరిణామాలు ఆసక్తి కల్గిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగు తుందనే ప్రచారం జరుగుతోంది.

త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న సమయంలో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య విభేదాలు రావడం ఆసక్తి కలిగిస్తున్నాయి. సిటీలో పట్టున్న ఎంఐఎం.. ఇంతకాలం సపోర్ట్ చేసిన అధికారపార్టీని టార్గెట్ చేయడంపై పలు రకాల చర్చలు జరుగుతు న్నాయి. అయితే బీజేపీ మాత్రం రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఎంఐఎం చెప్పినట్లు నడుచుకునే టీఆర్ఎస్.. గ్రేటర్ ఎన్నికల కోసమే కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శిస్తోంది. ఎంఐఎంతో తమకు సంబంధం లేదని ఓటర్లు భావించేలా గులాబీ నేతలు ఎత్తులు వేస్తున్నారంటున్నారు కమలనాధులు.
S.S.Yadav, Senior Journalist

127 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here