రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు

0
120

వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమైనవి, ఇవి రైతుల జీవితాలనే మార్చేస్తాయి. రెండు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెడుతూ వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్న మాటలివి. బిజు జనతాదళ్, వైయస్ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతుతో ఎన్డీఏ ఈ బిల్లులను నెగ్గేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకుంది.

రైతు నిరసనలు , ప్రతిపక్ష పార్టీల వాకౌట్ల మధ్య గత వారం లోక్సభలో మూడు వ్యవసాయ రంగ బిల్లులకు ఆమోదం లభించింది. వ్యవసాయ బిల్లు బిజెపి, దాని దీర్ఘకాల మిత్రపక్షం అకాలీదళ్ మధ్య చీలికను తెచ్చించింది. అకాలీదళ్ మొదట ఈ బిల్లులకు మద్దతు ఇచ్చినా, పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తడటంతో ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. శిరోమణి అకాలీద ళ్ఎంపీ హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.

వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమని, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు పునాది పడతాయని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్‌పీతో ఈ బిల్లులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతు లు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని తోమర్‌ తెలిపారు.

అయితే వ్యవసాయ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉందని విమర్శించింది. కాగా వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ఆమోదం పొందించేందుకు మోదీ సర్కార్‌ పట్టుదలతో ఉంది.

రైతులకు నష్టం కలిగించేలా బిల్లులు ఉన్నాయంటూ విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్ప‌టికే ఆ బిల్లుల‌కు లోక్‌స‌భలో ఆమోదం లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here