నిన్న అతడికి..నేడు ఆమెకు…కరోనా పాజిటివ్!

2
301

దేశంలో కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. నిన్నటికి నిన్న బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ పాజిటివ్ వచ్చింది. ఈ విఫయాన్నిఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేశాడు. ఇప్పుడు ఆయన సన్నిహితురాలు మలైకా అరోరా కూడా కోవిడ్ పాజిటివ్ అని సమాచారం. ఆమె చెల్లెలు అమృత అరోరా ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు చెప్పినట్టు సమాచారం. అంతకు ముందు మలైకా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తన ఆరోగ్యం గురించిన చెడు వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నాకు కరోనా పాజిటివ్ అని తేలిది. ఈ విషయం మీ అందరికీ తెలియజేయడం నా కర్తవ్యం. నేను బాగానే ఉన్నారు. కరోనా లక్షణాలేమీ లేవు. ఇంట్లో ఏకాంతంలో ఉన్నాను. వైద్యులు, అధికారుల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉంటాను. మీ ససోర్ట్ కోసం ముందుగానే మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను, రాబోయే రోజుల్లో నా ఆరోగ్యం గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఇది అసాధారణ సమయం, మానవాళి ఈ వైరస్ అధిగమిస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎంతో ప్రేమతో అర్జున్ ” అని సోషల్ మీడియాలో రాసుకున్నారాయన.


ఇది ఇలావుంటే, లాక్ డౌన్ సమయంలో ఈ జంట ఒకే ఇంట్లో ఉంటున్నట్టు తెలిపే ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ జంట తరచూ పార్టీలకు వెళ్లటం .. విదేశల్లో విహారిస్తూ మీడియా కంటికి చిక్కారు. దాంతో ఈ జోడీ ఇక ఓపెన్ గానే కలిసి తిరగటం ప్రారంభించారు. ఇల్లు దాటిా బయటకు వెళ్లకుండా ఈ జంట ఇంట్లోనే ఏకాంతంగా గడిపేందుకు కరోనా కాలం బాగా కలిసొచ్చిందని బాలీవుడ్ లో జోకులు పేలుతున్నాయి. కాగా, 46 ఏళ్ల మలైకా భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకుని తన కన్నా 11 ఏళ్లు చిన్నవాడైన అర్జున్‌తో డేటింగ్ చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here