పందుల పాలిట మృత్యుదేవత ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. అసోంలో లక్ష పందులు మృత్యువాత…

14
602

అసోంని వణికిస్తున్నఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
12 వేల పందుల నిర్మూలనకు అసోం కీలక నిర్ణయం
14 జిల్లాల్లో వ్యాప్తి , లక్ష పందులు మృత్యువాత
పందుల యజమానులకు పరిహారం

దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నవేళ అసోంను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వెంటాడుతోంది. పందుల వల్ల వ్యాపించే ప్రాణాంతక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) ప్రస్తుతం అసోంను వణికిస్తోంది. రాష్ట్రంలో తొలిసారి గత ఫిబ్రవరిలో ఈ వ్యాధి వ్యాపించింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తితో అప్రమత్తమైన అసోం ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యాధి విజృంభణను అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంతేకాదు వాటి యజమానులకు తగిన విధంగా పరిహారం చెల్లించాలని అధికారులను కోరారు.

ఆఫ్రకన్ స్వైన్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలో పందుల సరఫరాను నిలిపివేశారు. పశుసంవర్ధక, పశువైద్య శాఖ సీనియర్ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఇప్పటివరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు ఈ వ్యాధితో మృత్యువాత పడ్డాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య లక్షకు పైనే ఉంటుందని బావిస్తున్నారు. దీంతో బాధిత జిల్లాల్లో పందులను చంపేయాలని, దసరాకు ముందే ఈ పని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగు త్వరితగతిన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పశుసంవర్ధక, పశువైద్య విభాగాన్ని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఫాంలలో సర్వే నిర్వహించాలని, ఆరోగ్యకరమైన జంతువులకు ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులను సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో14 జిల్లాల్లోని 30 బాధిత కేంద్రాల్లో కిలోమీటర్ పరిధిలో వరాహాలను సంహరించేందుకు నిర్ణయించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. అలాగే సంబంధిత పరిహారాన్నిఆయా యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత నిధిని కేంద్రం విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా 2019 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో వీటి సంఖ్య 21 లక్షలుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య సుమారు 30 లక్షలకు పెరిగింది.

అస్సాంలో పంది పెంపకంలో దాదాపు పది లక్షల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటున్నారని అస్సాం పశువుల అభివృద్ధి సంస్థ రంగాల అధికారి జగన్నాథ్ కలిత తెలిపారు. “సగటున, అస్సాంలో ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయల విలువైన పందిపిల్లలు, పంది మాంసం కొనుగోలు చేసి విక్రయిస్తారు.”
2019 ఏప్రిల్‌లో చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో (అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు) ఏఎస్ఎఫ్ ను గుర్తించగా, 1921లో కెన్యా, ఇథియోపియాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉనికి తొలిసారి బైట పడింది.

14 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is basically a game where you can do anything you want. Second life is literally my second life (pun intended lol). If you want to see more you can see these sl articles and blogs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here