బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ,లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పాయల్ ఘోఫ్ ఆరోపించారు.
మాట్లాడాలని ఇంటికి పిలిస్తే వెళ్లానని , ఓ గదిలోకి తీసుకువెళ్లి.. నా దుస్తులు విప్పి బలాత్కరించ బోయారని చెప్పింది. అప్పుడు ఆయన మద్యం తాగి ఉన్నారని చెప్పింది. ‘బాంబే వెల్వెట్’ చిత్రీకరణ సమయంలో ఇదంతా జరిగింది.
‘మీటూ’ ఉద్యమం సమయంలోనే బయటకు వచ్చి అనురాగ్ కశ్యప్ గురించి చెప్పాలనుకున్నా. అనురాగ్ వేధిస్తున్నాడని అప్పుడే ట్వీట్ చేశా. దర్శకుడిపై ఈ తరహా ఆరోపణలు చేస్తే అవకాశాలు రావని కొందరు చెప్పడంతో ట్వీట్ డిలీట్ చేశానని. దాంతో అనురాగ్ తనను వాట్సా్‌పలో బ్లాక్ చేశాడంది.
పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. పాయల్ చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు ట్విటర్ లో పేర్కొన్నారు.
అనురాగ్ భార్య ఆర్తీ బజాజ్, తాప్సీ, అనుభవ్ సిన్హా, టిస్కా చోప్రా, సుర్వీన్ చావ్లా ఆయనకు మద్దతుగా నిలిచారు.