బీజేపీ మాజీ లోక్ సభ సభ్యుడు పరేష్ రావల్ ప్రతిష్టాత్మక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) చైర్మన్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ పరేష్ రావల్‌ను NSD చైర్మన్‌గా నియమించారనే విషయాన్ని తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని, NSD కుటుబం ఆయన్ని సగౌరవంగా ఆహ్వానిస్తోందని, ఆయన నాయకత్వంలో మరెన్నో మైలురాళ్లు అందుకుంటాం అని ట్వీట్ చేసింది.
విలక్షణ నటుడుగా, విలన్ గా పరేష్ రావల్ గుర్తింపు పొందారు. ఆయన నియా మకం పట్ల కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. 2017 నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. నసీరుద్దీన్ షా, ఓం పూరి, ఇర్పాన్ ఖాన్ వంటి ఎంతో మంది ప్రము ఖులు ఎన్ ఎస్ డి మాజీ విద్యార్థులు.
పరేష్ రావల్ రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. గుజరాత్ కు చెందిన పరేష్ రావల్ 1972లో థియేటర్ ద్వారా నటనా రంగంలో ప్రవేశించారు. తరువాత పలు చిత్రాల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణం క్షణంలో విలన్ గా నటిం చారు. 2014లో అహ్మదాబాద్ ఈస్ట్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రావల్ కు సమకాలీనుడైన మరో నటుడు, బీజేపీకి చెందిన అను పమ్ ఖేర్ 2001 నుంచి 2004 వరకు వాజ్ పాయి హయాంలో NSD చైర్ పర్పన్ గా ఉన్నారు.