జాతి మెచ్చిన గాయకుడు…

0
185

స్పీ బాలసుబ్రమణ్యం తన గాన మాధుర్యాన్ని తెలుగు వారికే కాదు యావత్ దేశానికి పంచారు. పదహారు భాషల్లో 40 వేల పాటలు పాడారు. నాలుగు భాషల నుంచి ఉత్తమ నేపథ్య గాయకుడుగా జాతీయ చలన చిత్ర అవార్డు అందుకున్నారు. కెరీర్ మొత్తం మీద ఒక్కసారి అందినా చాలు అనుకునే ఆ అవార్డు ఆయనను ఆరు సార్లు వరించింది.

దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో సైతం మన బాలూ ప్రత్యేక ముద్ర వేశారు. 1981 లో వచ్చిన ఏక్ దుఝే కేలియో ఆయన పాడిన తేరె మేరే బీచ్ మే కైసాహై యే బంధన్ … పాట దేశమంతా మార్మోగింది. ఆ పాట ఆయనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బాలూ ఒకప్పడు రెగ్యులర్ సింగర్. మైనే ప్యార్ కియా..హమ్ ఆప్ రే హై కౌన్, సాజన్ లో ఆయన పాటలను ఎవరు మరవగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here