ప్రేక్షకుల మెదడుకు మేత ‘ఫోరెన్సిక్’

0
49


భారతీయ సినిమాపై మలయాళీలది బలమైన ముద్ర. ఇతర భాషా చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటాయి మలయాళీ సినిమాలు. కమర్షియల్ మసాలాలు తక్కువ పాళ్లలో ఉండి వాస్తవికత పాళ్లు ఎక్కువ. కథాంశము ఏదైనా వారి శైలి భిన్నం అనేది అందరూ ఒప్పుకుంటారు. అలాంటి విభన్న చిత్రమే ఇటీవల వచ్చిన FORENSIC.ఇదొక క్రైమ్ థ్రిల్లర్. క్రైం థ్రిల్లర్స కోసం ఇంగ్లీష్ లేదా స్పానిష్ సినిమా చూడడం నాకు అలవాటు కాని ఈ మధ్య గమనిస్తే మళయాళ సినిమాలో మంచి క్రైమ్ థ్రిల్లర్స కనిపిస్తున్నాయి. సబ్జెక్ ని చాలా ఇన్పర్మేటివ్ గా అందిస్తూ థ్రిల్లర్ ఆభ్జెక్ట్ ని వారు మేన్టేన్ చేస్తున్న విధానం చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. ఈ సినిమా ని దర్శకులు మలచిన విధానం చూసి తీరవలసిందే.

చిన్న పిల్లలను అపహరించి చంపడం జరుతుగుంది. కేసుని ఒక లేడి పోలేస్ ఆఫీసర్ తన టీమ్ తో ఇన్వెస్టీగేట్ చేస్తూ ఉంటుంది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గా సామ్యుల్ ఈ టిం తో జాయిన్ అవుతాడు. ఒక క్రైం ఇన్వెస్టిగేషన్ లో ఫొరెన్సిక్ సైన్స్ ఎంత అవసరమే మెషీనరితో పాటుగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ముందుగా క్రైం చేసున్నది చిన్న పిల్లవాడు అని తెలుసుకుంటారు. చిన్న పిల్లలలో సీరియల్ కిల్లర్స్ ఉంటారా అన్న దానికి సమాధానంగా భారతదేశం నుండి అలాగే ఇతర దేశాల దాకా చిన్నపిల్లలు సీరియల్ కిల్లిర్స్ గా ఉన్న కొన్ని ఉదాహరణలు చూపించడం ఒక కొత్త కోణం. తరువాత మానసికంగా సమస్యలతో ఉన్న వారిని కంట్రోల్ చేసే క్రైమ్ ఎక్పర్టైస్ గురించి చూస్తాం. కొంత ఫామిలీ డ్రామా, ఎమోషన్స్, ట్విస్ట్ తొ ఈ సినిమా రివెంజ్ఫుల్ ఆస్పెక్ట్ తో ఎండ్ అవుతుంది. ఇన్ని షేడ్స్ ఒక్క సినిమాలో చొప్పించడానికి టీం వర్క్ చాలా అవసరం. ముఖ్యంగా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ తో సినిమా తీయడం జరిగింది.

ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఆ టీంపై గౌరవం కలుగుతుంది. తమ సినిమా చూసే ఆడియన్స్ బుర్రలపై, వారి ఇంటెలెక్ట్ పై సినిమా టీం కు కొంత గౌరవం ఉన్నట్లు కనిపిస్తుంది. సినిమా చూసే వారిని వెర్రి వారిగా బుర్రతక్కువ వెధవలుగా అనుకునే దర్శకులన్నా, నటులన్నా, తమ ప్రజలను గొర్రెలుగా ట్రీట్ చేసే నాయకులన్నా నాకు అంత గౌరవం లేదు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుగా సినిమాలు తీసున్న మన తెలుగు భాషా దర్శకులు మన పొరుగు రాష్ట్రాలలో సినిమాను చూసి కొంతైనా ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. ఆడియన్స్ని వెధవలు అనుకుని మన తెలుగు సినిమా ప్రపంచం నడుస్తుంది.తెలుగులో ఉన్న ఇంటేలిజెంట్ ఆడియన్స్ అంతా విదేశి సినిమా వైపు ప్రయాణిస్తున్నారు. కాని మళయాళ సినిమా వారి భాషలోని ఇంటెలిజెంట్ ఆడియన్స్ ను వారి వద్దే వుంచుకోగలుగుతుంది. దీని వల్ల ఆ భాషాభిమానం, ఆ సంస్కృతి పట్ల గౌరవం వారి సొంతమవుతాయి. మన వారికీ విషయం ఎప్పటికైనా అర్థమవుతుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here