ఢిల్లీలో దారుణం…86 ఏళ్ల బామ్మపై అత్యాచారం…

0
75

నైరుతి ఢిల్లీ, చావ్లా ప్రాంతంలోని ఓ నిర్జన ప్రాంతంలో 86 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అ త్యాచారం జరిపాడు. నిందితుడు రేవ్లా ఖాన్పూర్ నివాసి సోను (37). అతడు ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సా యంత్రం వృద్ధ మహిళ పొరుగు గ్రామానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. మార్గం మధ్యలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న నిందితుడు ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. ఆమె వెళ్లే చోటుకు భద్రంతగా చేరుస్తానని చెప్పివాహనంపై ఎక్కించుకున్నాడు. తరువాత ఆమెను ఓ నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.

ఐపిసి సెక్షన్ 376 (అత్యాచారం) కింద చావ్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, నిందితుడిని అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్ (ద్వారకా) సంతోష్ కుమార్ మీనా చెప్పారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం తీసుకున్నామని, ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి స్థిరంగా ఉందని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని పోలీసులు చెప్పారు.

ఇదిలావుంటే, ఈ ఘటన తీవ్ర కలత చెందే విధంగా ఉందని ఢిల్లీ మహాళా కమిషపన్ పేర్కోంది. కమిషన్ చెప్పినదాని ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల సమ యంలో ఆ మహిళ పాలవ్యక్తి కోసం ఎదురు చూస్తుండగా నిందితుడు వచ్చి ఆ రోజు మిల్క్‌మెన్ రాడని , పాలు తీసుకునే చోటుకు తీసుకెళతానని చెప్పాడని, కానీ అతడు ఆమెను ఓవ్యవసాయ క్షేత్రానికి తిసుకెళ్లి రేప్ చేశాడని చెప్నారు. అమ్మమ్మలాంటి దాన్నని ఆ మహిళ ఎంత మొరపెట్టుకున్నా నిందితుడు కనికరం చూపలేదు. ఆమెను దారుణంగా హింసించి రేప్ చేశాడు. మహిళ కేకలు విని సమీప గ్రామస్తులు సంఘటనా స్థలికి చేరుకుని నిందితుడుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఆరునెలల పాపం నుంచి 90 ఏళ్ల బామ్మ వరకు ఢిల్లీలో ఎవరూ సురక్షితంగా లేరనటానికి ఈ ఘటన ఓ ఉదాహరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here