భారత్ లో కరోనా కేసులు పై పైకి
దేశంలో మహమ్మారి ఉగ్రరూపం
ఒక్కరోజే 84వేల కేసులు నమోదు
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు తీవ్రత పెరిగి కేసుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తం గా రికార్డు స్థాయిలో 83,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 1043 మంది బాధితులు మర ణించినట్లు తెలిపింది. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమో దవడంతో ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,53,407కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,15,538 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినుంచి 29,70,493 మంది బాధితులు కోలుకున్నారు. ఇక, దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 67,376కు చేరింది. గత 24 గంటల్లో 11,72,179 మందికి కరోనా పరీక్ష నిర్వహించామని ఐసిఎమ్ఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,55,09,380మందికి పరీక్షలు పరీక్షించామని పేర్కొంది.
మరోవైపు, తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 10 మృతి చెందారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,33,697కు చేరింది.ఇక, కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 856కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32,537 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి లక్షా 38వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అన్ లాక్ 4 అమలు జరుగుుతున్న వేళ పాజిటివ్ కేసులు మరింత పెరగటం ఆందోళనకు గురిచేస్తోంది. రాబోవు రోజుల్లో ఈ మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకు పడనుందో తలుచుకుంటేనే వణుకు పడుతోంది. . అన్ లాక్ చేసినా ప్రజలు స్వీయ జాగ్రత్తల పట్ల అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టేనని మరిచి పోవద్దు.