రూ.43 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

63
347

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం పట్టుబడింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రూ.43 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది స్మగ్లర్ల నుంచి 504 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇవన్నీ 99.9 శాతం స్వచ్ఛమైనవని పేర్కొన్నారు. వాటిని సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ బంగారం బిస్కెట్లను మయన్మార్‌ నుంచి తీసుకొస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. ఈ గోల్డ్ స్మగ్లర్లపై దాదాపు నెలరోజులపాటు నిఘా పెట్టినట్టు తెలిసింది. నిన్న డిబ్రుగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు నుంచి దిగిన ఈ ఎనిమిది మందీ ఈ బంగారాన్ని ఢిల్లీ, ముంబై, కోల్ కతా వంటి నగరాల్లో స్మగుల్ చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. స్మగ్లర్ గ్యాంగ్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ప్రత్యేకంగా కుట్టించుకున్న దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. వీళ్ళు నకిలీ ఆధార్ కార్డుతో ప్రయాణించినట్టు తెలుస్తోంది. మియన్మార్ నుంచి భారత్ లోకి స్మగుల్ చేసేందుకు ప్రయత్నించారని, మణిపూర్ లోని మోరేద్వారా ఇదంతా సాగుతోందని తెలిసింది. గౌహతి నుంచి ఈ స్మగ్లింగ్ సిండికేట్ తన కార్యకలాపాలను సాగిస్తున్నట్టు వెల్లడైంది.

63 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here