దీపిక కిడ్నాప్ ఎవరి పని?

3
436

వికారాబాద్ లో యువతి కిడ్నాప్ కేసులో గాలింపు కొనసాగుతోంది . షాపింగ్ కి వెళ్లి వస్తుండగా దుండగులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అనంతగిరి వైపు వెళ్లి ఉండొచ్చనే అనుమానం. అక్కాచెల్లెల్లు వికారాబాద్ లో పనిమీద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా దుండగులు అక్క దీపికను కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. కిడ్నాప్ కు పాల్పడిన దుండగులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేధారు.

మరోవైపు, దీపిక కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం..దీపిక, అఖిల్‌ 2016లో ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని లాక్కోని పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్‌ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యువకుడి తండ్రి మరో విధంగా స్పందించారు. అసలు తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తనకు ఇప్పటి వరకు తెలీదన్నారు. పోలీసుల ద్వారానే తమకు ఆ విషయం తెలిసిందని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నుంచి అఖిల్‌కు వరుసగా ఫోన్‌ చేస్తున్నా.. స్విచ్‌ ఆఫ్‌ వస్తుందని తెలిపారు. అయితే దీపిక గురించి పూర్తి వివరాలు వెళ్ల డించడానికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.

ప్రస్తుతం దీపిక కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్‌ సీఐ గురుకుల రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి కిడ్నాప్‌పై స్థానికులను విచారించారు. అనంతరం సీసీ పుటేజీ ద్వారా కారు గురించి ఆరా తీశారు. కారు హైదరాబాద్‌ వైపు వెళ్లిన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

3 COMMENTS

  1. Does your website have a contact page? I’m having problems locating it but, I’d like to shoot you an email. I’ve got some ideas for your blog you might be interested in hearing. Either way, great blog and I look forward to seeing it grow over time.

  2. #file_links[C:\key\diflucan.txt,1,N]: {#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]} – #file_links[C:\key\diflucan.txt,1,N]
    {https://diflucanst.com/|http://diflucanst.com/}# #file_links[C:\key\diflucan.txt,1,N]
    #file_links[C:\key\diflucan.txt,1,N] [url={https://diflucanst.com/|http://diflucanst.com/}#]{#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]}[/url] #file_links[C:\key\diflucan.txt,1,N]

  3. It’s really a nice and helpful piece of info. I am glad that you shared this useful information with us. Please keep us informed like this. Thanks for sharing.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here