కోవిడ్ 19 .. ఇండియా @ 50 లక్షలు

0
213

మెరికా తరువాత 50 లక్షలు దాటిన రెండవ దేశంగా భారత్ అవతరించింది. బుధవారం కొత్తంగా 90,123 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 50 లక్షల20 వేల 360కి చేరింది. ఇక ఈ మహమ్మారి వల్ల మరో 1290 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 82,066 కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 9,95,933 యాక్టివ్ కేసులు ఉండగా, 39,42,361 మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మనదేశంలో కోవిడ్ -19 బారినపడ్డ వారి సంఖ్య ఆగస్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు దాటింది.40 లక్షల నుంచి 50 లక్షలకు చేరటానికి కేవలం పదకొంగు రోజులే పట్టింది.

కోవిడ్-19 బారినపడి మంగళవారం కర్ణాటకలో 97 మంది చనిపోయారు. ఆ రాష్ర్టంలో ఇప్పటి వరకు 4,75,265 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. 7,481 మంది చనిపోయారు. ఇక ఏపీలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 8,846 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు 5,83,925 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఏపీలో పక్షం రోజులకు పైగా రోజుకు 10,000 కి పైగా కేసులు నమోదయ్యాయి ఆ తరువాత 3-4 రోజుల నుంచి నిత్యం 9,000ల లోపు కేసులు నమోదవుతున్నాయి.

రికవరీ విషయంలో ప్రపంచంలోనే మన దేశం ముందుందని.. భారీ ప్రాణ నష్టాన్ని నివారించటానికి అధిక మరణాలు సంభవించిన దేశాల అనుభవం నుండి మన దేశం ఎంతో నేర్చుకుందని ప్రభుత్వం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here