ఎపిలో స్కూళ్ల పున:ప్రారంభం మళ్లీ వాయిదా!

0
259

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించింది. కరోనా పరిస్థితులు ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబర్‌ 2న స్కూళ్లు తెరుచుకుంటాయి. మరోవైపు, పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఏపీ సర్కార్ తాజా నిర్ణయంతో మరో నెల రోజులు పిల్లలు ఇళ్లకే పరిమితం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here