ఇప్పడు అర్నాబ్ వర్పెస్ శివసేన

0
395

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని శివసేన టార్గెట్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో పాటు బాలీవుడ్ డ్రగ్స్ కల్చర్‌పై ఆయన విస్తృతంగా మీడియా ట్రయల్స్ చేస్తున్నారు. శివసేనపై కంగనా రనౌత్ చేస్తున్న పోరాటంలో అర్నాబ్ కంగనకు మద్దతు ఇస్తున్నారు.

మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే సిల్లీ పాలిటిక్స్ ( వెర్రి రాజకీయాలు) చేస్తున్నారని విమర్శించటం శివసేనకు బాగా కాలింది. దీంతో శివసేన నేతృత్వంలోని మహా సర్కార్ కంగనా తరువాత ఇప్పుడు అర్నాబ్‌ను లక్ష్యంగా చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ అర్నాబ్‌కు 60 పేజీల ప్రత్యేక నోటీసు ఇచ్చింది.అంతే కాదు సిఎం ఉద్దవ్‌ను ప్రశ్నించినందుకు జైల్లో పెడతామని కూడా బెదిరించింది.

అయితే ఈ నోటీసులకు భయపడని అర్నాబ్ అంటున్నారు. మహా సర్కార్‌ను ప్రశ్నిస్తూనే ఉంటానని, ఈ యుద్ధంలో చివరి వరకు పోరాడతానని అన్నారు.”నేను కోర్టులో వారితో పోరాడతాను, కాని అటువంటి అప్రజాస్వామిక పద్ధతులను ఎప్పటికీ అంగీకరించను.వారికి అధికారం రాజ్యాంగం ఇచ్చిన బహుమతి కాదు, ఇది ప్రతి పౌరుడి హక్కు. నేను ఆ హక్కు కోసం కొట్టాడుతూనే ఉంటాను. ”అంటూ మహా సర్కార్ నోటీసులపై స్పందించారు అర్నాబ్.

అంతేకాదు, మహా సర్కార్ తన జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించిందంటూ రిపబ్లిక్ టీవీ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. దీనిని బట్టి ఇప్పుడు శివసేన వర్సెస్ కంగనా తరువాత సేన వర్సెస్ అర్నాబ్ గా మారింది. ఇది ఎక్కడికి దాకా పోతుందో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here